Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 29 2021 @ 18:36PM

కేసీఆర్, జగన్ మొదటి నుంచి కవలపిల్లల్లా కలిసి వెళ్తున్నారు: రేవంత్‌

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ మొదటి నుంచి కవలపిల్లల్లా కలిసి వెళ్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం కోసం జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తప్పుబట్టారు. తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేయడం.. కలిసిపోదాం అని పేర్నినాని అనడం.. అనుకోకుండా జరిగినవి కావన్నారు. జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందని రేవంత్‌ అనుమానం వ్యక్తం చేశారు.మంత్రి కేటీఆర్ భీమవరంలో పోటీ చేస్తారో, లేక బొబ్బిలిలో పోటీ చేస్తారో తెలియదని చెప్పారు. జగన్ జైలుకు వెళ్తాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. పేర్నినాని వ్యాఖ్యలను టీఆర్ఎస్‌ ఎందుకు ఖండించడం లేదు? అని ప్రశ్నించారు. మౌనంగా ఉన్నారంటే నాని వ్యాఖ్యలు స్వాగతించినట్లే కదా అని నిలదీశారు. ఇలాంటి కుట్రలను ప్రజలు సహించరని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement