కేసీఆర్‌ సభ రద్దు చేసుకోవాలి: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-04-11T19:54:13+05:30 IST

ఈ నెల 14న హాలియాలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న బహిరంగ సభను రద్దు చేసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.

కేసీఆర్‌ సభ రద్దు చేసుకోవాలి: జీవన్‌రెడ్డి

నల్గొండ: ఈ నెల 14న హాలియాలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న బహిరంగ సభను రద్దు చేసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 14న కేసీఆర్‌ సభకు కలెక్టర్‌, ఎస్పీ అనుమతి ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో కరోనా కారణంగా సీఎం జగన్ సభ రద్దు చేసుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్‌ ఓటమి భయంతో రెండో సారి సభ పెడుతున్నారని, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని కేసీఆర్‌ సభ రద్దు చేసుకోవాలని జీవన్‌రెడ్డి కోరారు.


నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అధికార టీఆర్‌ఎస్‌.. తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 14న హాలియాలో సీఎం సభ ఏర్పాటు ఖాయమైంది. సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 17న ఉండగా, ప్రచార గడువు ముగియటానికి దాదాపు 24 గంటల ముందు జరిగే సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొనబోతున్నారు.

Updated Date - 2021-04-11T19:54:13+05:30 IST