లాక్‌‌డౌన్‌ పెట్టడం కేసీఆర్‌కు ఇష్టం లేదు: హోంమంత్రి

ABN , First Publish Date - 2021-04-29T01:16:59+05:30 IST

లాక్‌‌డౌన్‌ పెట్టడం సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదని, లాక్‌డౌన్‌పై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని హోంమంత్రి

లాక్‌‌డౌన్‌ పెట్టడం కేసీఆర్‌కు ఇష్టం లేదు: హోంమంత్రి

హైదరాబాద్: లాక్‌‌డౌన్‌ పెట్టడం సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదని, లాక్‌డౌన్‌పై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై పోలీస్ ఉన్నతాధాకారులో చర్చించామని తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని పరిస్ధితులపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని ప్రకటించారు.


సమీక్ష తర్వాత లాక్‌‌డౌన్‌పై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రస్తుత పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, లాక్‌డౌన్‌ వల్ల ఆర్ధిక ఇబ్బందులు చాలా వస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరణాలు కూడా పెరుగుతున్నాయని మహమూద్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులను అసరాగ చేసుకుని బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా కొనసాగుతుందని మండిపడ్డారు. ఆక్సిజన్ నుంచి రెమిడిసివర్ ఇంజక్షన్ వరకూ బ్లాక్ మార్కెట్ దందా జరుగుతుందని తెలిపారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని తెలిపారు. 

Updated Date - 2021-04-29T01:16:59+05:30 IST