Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 23 2021 @ 17:23PM

కేసీఆర్‌, మోదీ ఇద్దరూ తోడు దొంగలే: రేవంత్‌రెడ్డి

హుజురాబాద్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌, మోదీ ఇద్దరూ తోడు దొంగలేనని ఆరోపించారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ధ్వజమెత్తారు. హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారం రేవంత్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను కేసీఆర్‌ అమలు చేయలేదని దుయ్యబట్టారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదని హెచ్చరించారు. మోదీ, కేసీఆర్‌ కలిసి పెట్రో ధరలతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. 20 ఏళ్లు జోడు గుర్రాల్లా ఈటల-హరీష్‌రావు తిరిగారని విమర్శించారు. ఇప్పుడు తనకు, ఈటలకు పడటంలేదని హరీష్‌రావు మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement