వర్సిటీలు, నిరుద్యోగ సమస్యపై కేసీఆర్‌ నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-06-03T10:34:48+05:30 IST

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో నియామకాలతోపాటు నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్య వైఖరి

వర్సిటీలు, నిరుద్యోగ సమస్యపై కేసీఆర్‌ నిర్లక్ష్యం

ఓయూలో విద్యార్థి నేత దయాకర్‌ నిరసన దీక్షలో వీహెచ్‌, ఆర్‌.కృష్ణయ్య


ఉప్పల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో నియామకాలతోపాటు నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు. నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు కలిసికట్టుగా కేసీఆర్‌ కళ్లు తెరిపించేలా తెలంగాణ పోరాటం తరహాలో ఉద్యమం తీసుకురావాలని విద్యార్థి నేతలను కోరారు.


ఆ ఉద్యమానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మంగళవారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద పరిశోధక విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్‌ చైర్మన్‌ చెనగాని దయాకర్‌ వర్సిటీల్లో వీసీల నియామకం, రాష్ట్రంలోని ఉద్యోగాల భర్తీ, ఓయూ భూములను రక్షించాలని ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వీహెచ్‌, ఆర్‌.కృష్ణయ్య దయాకర్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.  

Updated Date - 2020-06-03T10:34:48+05:30 IST