కేసీఆర్ నాకు ఈ అవకాశం ఇస్తారని ఊహించలేదు: నోముల భగత్

ABN , First Publish Date - 2021-03-29T23:02:48+05:30 IST

సీఎం కేసీఆర్ తనకు ఈ అవకాశం ఇస్తారని ఊహించలేదని నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ చెప్పారు. సోమవారం

కేసీఆర్ నాకు ఈ అవకాశం ఇస్తారని ఊహించలేదు: నోముల భగత్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ తనకు ఈ అవకాశం ఇస్తారని ఊహించలేదని నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘నాగార్జునసాగర్‌లో మాకు ఎవరూ పోటీ కాదు, మాకు మేమే పోటీ’’ అని భగత్ ప్రకటించారు. కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టిన గెలుస్తారని చెప్పారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు నోముల నర్సింహాయ్య ఏం చేసారన్నది ప్రజలకు తెలుసన్నారు. సోమవారం నామినేషన్ వేశాక ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని ప్రకటించారు. ప్రచారంలో ఎవరెవరు పాల్గొంటరనేది సీఎం నిర్ణయిస్తారని భగత్ తెలిపారు.

Updated Date - 2021-03-29T23:02:48+05:30 IST