మరోసారి టీఆర్‌ఎస్‌ చీఫ్‌గా కేసీఆర్‌!

ABN , First Publish Date - 2021-10-23T08:09:11+05:30 IST

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ మరోసారి ఎన్నికవడం ఖాయమైంది. పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగంగా శుక్రవారం నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసే నాటికి ఆయన ఒక్కరి పేరుతోనే 18 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇ

మరోసారి టీఆర్‌ఎస్‌ చీఫ్‌గా కేసీఆర్‌!

  • ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే.. 25న పార్టీ ప్లీనరీలో  ప్రకటన


హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ మరోసారి ఎన్నికవడం ఖాయమైంది. పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగంగా శుక్రవారం నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసే నాటికి ఆయన ఒక్కరి పేరుతోనే 18 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతర నాయకులెవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో కేసీఆర్‌ ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే కానుంది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25న (సోమవారం) ఇక్కడి హైటెక్స్‌లో జరిగే పార్టీ ప్రతినిధుల సభ (ప్లీనరీ)లో అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఎన్నికపై అధికారిక ప్రకటన చేస్తారు. 2001లో పార్టీని స్థాపించిన నాటినుంచి కేసీఆర్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-10-23T08:09:11+05:30 IST