కోవిడ్ పరిస్థితిపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష

ABN , First Publish Date - 2020-11-22T22:06:00+05:30 IST

కోవిడ్ పరిస్థితిపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష

కోవిడ్ పరిస్థితిపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్‌: కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోందని, అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై ప్రగతి భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరగకుండా సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత భద్రత పాటించడమే అసలైన మందని అన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య పదిశాతం లోపే ఉంటుందని, రికవరీ రేటు 94.5 శాతం ఉంటుందని కేసీఆర్ తెలిపారు. కోవిడ్ వచ్చిన వారు కొంత ఇబ్బంది పడుతున్నా మరణాల రేటు చాలా తక్కువ ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉంచామని, కోవిడ్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేసీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-11-22T22:06:00+05:30 IST