Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శం: సత్యవతి రాథోడ్‌

మంచిర్యాల: సీఎం కేసీఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌ కొనియాడారు. టీఆర్‌ఎస్‌ వార్డు కమిటీలను ప్రారంభించేందుకు ఆదివారం మంచిర్యాల జిల్లాలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ పేద ప్రజలకు అండగా ఉందని భరోసా ఇచ్చారు. విపక్షాలు ఎన్ని యాత్రలు చేసినా వారికి అధికారం పగటి కలగానే మిగిలిపోతుందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని, ప్రగతిభవన్‌ గోడలు బద్దలు కొట్టడం కాదు, పేద ప్రజల మనసు గెలుచుకోవాలని సూచించారు. ఎల్‌ఐసీ, సింగరేణి, బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంటి ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దేశ రాజకీయాలన్నీ కేసీఆర్‌ వైపే చూస్తున్నాయని, టీఆర్‌ఎస్‌ అత్యంత ప్రభావిత పార్టీ కాబట్టే ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి కేంద్రం స్థలం కేటాయించిందని సత్యవతి రాథోడ్‌ తెలిపారు. 

Advertisement
Advertisement