Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారు: షర్మిల

నల్గొండ: రాష్ట్రంలోని అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కేసీఆర్ కుటుంబానికేనని అన్నారు. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన 1200 కుటుంబాలను బెదిరించి.. ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే భూములు లాక్కుంటే ఎవరికి చెప్పుకోవాలి? అని షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టింది రైతుల కోసమా..? కమీషన్ల కోసమా..? అని ప్రశ్నించారు. ‘‘మీకు దమ్ముంటే నాతో పాదయాత్ర చేయండి. సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి నేను ఇంటికి పోతా. టీఆర్ఎస్‌ పాలనపై నమ్మకం ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలి’’ అని షర్మిల అన్నారు.

TAGS: KCR SHARMILA

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement