కేటీఆర్‌ను కలిసిన ఆదివాసి సంఘాల ప్రతినిధులు

ABN , First Publish Date - 2022-01-26T22:04:47+05:30 IST

ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ని ఆదివాసి సంఘాల ప్రతినిధులు మరియు తెరాస ఆదివాసి ప్రజాప్రతినిధులు కలిశారు. ఆదివాసీ సంఘాల ప్రతినిధులు మరియు ఆదివాసి టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మంత్రిని కలిశారు.

కేటీఆర్‌ను కలిసిన ఆదివాసి సంఘాల ప్రతినిధులు

హైదరాబాద్: ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ని  ఆదివాసి సంఘాల ప్రతినిధులు మరియు తెరాస ఆదివాసి ప్రజాప్రతినిధులు కలిశారు. ఆదివాసీ సంఘాల ప్రతినిధులు మరియు ఆదివాసి టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మంత్రిని కలిశారు. తమ తెగలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కేటీఆర్ ను కోరారు. షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల కోసం తీసుకోవాల్సిన అభివృద్ధి సంక్షేమ చర్యల పైన వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. తక్కువ సంఖ్యలో... ఎక్కువ ప్రాంతాల్లో నివాసం ఉండే ఆదివాసీలకు  ప్రభుత్వం మరింత చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల కు సంబంధించిన సమస్యల పైన ఆయా ప్రతినిధులు, నాయకుల అభిప్రాయాలు విన్న అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు.


ఇప్పటికే ఆదివాసీ సమస్యలపైన తమ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా ఆదివాసి రైతులకు సంబంధించి అటవీశాఖ భూముల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివాసులు వ్యవసాయం చేసుకుంటున్న అటవీ భూములు పైన హక్కు పత్రాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టానికి సంబంధించిన పరిమితులున్న విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈ విషయంలో సాధ్యమైనంత ఎక్కువ సానుకూల దృక్పధాన్ని తమ ప్రభుత్వం కలిగి ఉందని తెలిపారు. ఆదివాసీల మావ మాటే ... మావ రాజ్ నినాదం స్ఫూర్తి మేరకే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గిరిజన తండాలను, ఆదివాసీ గుడెలను గ్రామ పంచాయతీలుగా మార్చి పరిపాలనాధికారన్ని ప్రజలకు దగ్గరగా చేసిందన్నారు. 

Updated Date - 2022-01-26T22:04:47+05:30 IST