అహంకారంతో రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-03-19T05:16:57+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గ నిర్దేశమైన భారత రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్‌ మార్చాలనడం తన అహంకారానికి నిదర్శనమని టీజేఎస్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ కోదండరాం, ఎమ్మా ర్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.

అహంకారంతో రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్‌
నాగర్‌కర్నూల్‌ సదస్సులో అభివాదం చేస్తున్న ప్రొఫెసర్‌ కోదండరాం, మందకృష్ణ మాదిగ

- వచ్చే నెల 9న యుద్ధభేరిని జయప్రదం చేయండి

- టీజేఎస్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ కోదండరాం, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ


నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మార్చి 18: తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గ నిర్దేశమైన భారత రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్‌ మార్చాలనడం తన అహంకారానికి నిదర్శనమని టీజేఎస్‌ వ్యవస్థాపకుడు  ప్రొఫెసర్‌ కోదండరాం, ఎమ్మా ర్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రాం భవన్‌లో భారత రాజ్యాంగ పరిరక్షణ  కమిటీ   జిల్లాస్థాయి సన్నా హక సదస్సు నిర్వహించారు. సదస్సుకు కోదండరాం, మం దకృష్ణ మాదిగ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ రాజుగా నియంత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రా జ్యాంగ బద్దంగా ఎన్నికైన సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ అధికార మదంతో రాజ్యాం గంపైనే విమర్శలకు దిగిన కేసీఆర్‌ను గద్దె దించడమే ఏకైక మార్గమన్నారు. వచ్చే నెల 9న హైదరాబాదులో జరిగే రాజ్యాంగ పరిర క్షణ యుద్ధభేరి సభకు జిల్లాలోని సామాజిక ప్రజా సం ఘాలు, మేధావులు, విద్యావంతులు పెద్ద సంఖ్యలో హాజ రై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీ ఎస్‌ రాష్ట్ర నాయకుడు గూట విజయ్‌, మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి చిన్నవెంకటేష్‌, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు  శ్యాంప్రసాద్‌రెడ్డి, బీఎంపీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గడ్డం విజయ్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు నేష లక్ష్మయ్య, ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు కోళ్ల శివ పాల్గొన్నారు.  


తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలి..

కల్వకుర్తి: నిరుద్యోగులతో కేసీఆర్‌ దోబూచులాడొద్దని తక్షణమే నోటిఫికేషన్‌ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చే యాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం కోరారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యపై గత ఆరు సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేయడంతోనే సీఎం కేసీఆర్‌ ఉద్యోగ ప్రకటన చేశారని తెలిపారు. ఉద్యోగాల కోసం విద్యార్థులు కోచింగ్‌ సెంటర్ల కోసం హైదరాబాద్‌ బాట పట్టారన్నారు. 119 నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వమే ఉచితంగా విద్యార్థుల కు కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనం తరం నాయకులు కోదండరాంను శాలువాతో సన్మా నించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ద య్య యాదవ్‌, జేఏసీ చైర్మన్‌ సదానందంగౌడ్‌, బీసీ సబ్‌ప్లాన్‌ ప్రధాన కార్యదర్శి గోపాల్‌, లెక్చరర్లు ఆంజనే యులు, మధుకాంత్‌, విష్ణుమూర్తి, కిరణ్‌, రవితేజ  పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-19T05:16:57+05:30 IST