బండి సంజయ్‌కి వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్

ABN , First Publish Date - 2021-11-08T01:55:28+05:30 IST

బీజేపీ నేత బండి సంజయ్‌కి సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్‌ చిల్లర మాటలు మానుకోవాలని

బండి సంజయ్‌కి వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్

హైదరాబాద్: బీజేపీ నేత బండి సంజయ్‌కి సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్‌ చిల్లర మాటలు మానుకోవాలని హెచ్చరించారు. ‘‘నన్ను జైలుకి పంపుతావా?.. నన్ను జైలుకి పంపి నువ్వు బతికి బట్టకడతావా?.. కేసీఆర్‌ను టచ్ చేసి చూడు తెలుస్తుంది. బండి సంజయ్‌ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. రైతులను గందరగోళానికి గురిచేస్తే బండి సంజయ్ ఆట కట్టిస్తాం. సిల్లీ బీజేపీ, సొల్లు బీజేపీ మాటలు రైతులు నమ్మొద్దు. పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నీటి వాటాల విషయంలో ఇప్పటివరకు కేంద్రం నోరు మెదపలేదు. 157 మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలి’’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-08T01:55:28+05:30 IST