నమ్మకాన్ని వమ్ము చేస్తున్న కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-09-18T05:25:41+05:30 IST

తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరిన కేసీఆర్‌.. ఇప్పుడు సీఎంగా ఉండి కూడా ఎందుకు నిర్వహించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు మండిపడ్డారు.

నమ్మకాన్ని వమ్ము చేస్తున్న కేసీఆర్‌
దౌల్తాబాద్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

 విమోచన దినాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదు?

 దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

 పలు పార్టీల ఆధ్వర్యంలో విమోచన దినం

       

దుబ్బాక/మిరుదొడ్డి, సెప్టెంబరు 17: తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరిన కేసీఆర్‌.. ఇప్పుడు సీఎంగా ఉండి కూడా ఎందుకు నిర్వహించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు మండిపడ్డారు. ప్రజల నమ్మకాన్ని సీఎం కేసీఆర్‌ వమ్ము చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం దుబ్బాకలోని క్యాంపు కార్యాలయం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అలాగే మిరదొడ్డిలో విమోచన దినోత్సవాన్ని బీజేపీ మండలాధ్యక్షుడు దేవరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. 

రాయపోల్‌: ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని పులిమామిడి మాజీ సర్పంచ్‌ రాజ్‌గోపాల్‌ తల్లి వెంకమ్మ జ్ఞాపకార్థం సమకూర్చిన దుస్తులను ఎమ్మెల్యే రఘునందన్‌రావు పంచాయతీ కార్మికులకు అందజేసి, సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య, నాయకులు కిషన్‌, బాలేష్‌, సురేందర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, ఆది వేణుగోపాల్‌, నర్సింలు, మంగళి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


పట్టణాలు, గ్రామాల్లో


చేర్యాల: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని చేర్యాల, కొమురవెల్లి మండలకేంద్రాల్లో బీజేపీ నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

గజ్వేల్‌: పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు బండారు మహేశ్‌, పంజాల అశోక్‌గౌడ్‌, మధుగారి రమాకాంత్‌, సతీష్‌ పాల్గొన్నారు.

బెజ్జంకి: మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు దోనే అశోక్‌, నాయకులు రాజు, సత్యనారాయణ పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పోతురెడ్డి వెంకట్‌రెడ్డి, నాయకులు ధర్మారెడ్డి, మల్లారెడ్డి, అశోక్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు.

కొండపాక: దుద్దెడలో బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినం నిర్వహించారు. కార్యక్రమంలో రామస్వామి, లింగం, సురేశ్‌, శ్రీహరి, పాండు పాల్గొన్నారు.

సిద్దిపేట అర్బన్‌: సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద పవన్‌ ఆధ్వర్యంలో సిద్దిపేటలో జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కనుకుంట్ల శంకర్‌, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కిష్టపురం లక్ష్మణ్‌, నాయకులు బన్సీలాల్‌, కర్ణాల చంద్రం, భిక్షపతి, నర్సింహులు, మన్నేకుమార్‌ పాల్గొన్నారు.


 

Updated Date - 2021-09-18T05:25:41+05:30 IST