Advertisement
Advertisement
Abn logo
Advertisement

కీగన్ పీటర్సెన్ ఒంటి చేతి క్యాచ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

కేప్‌టౌన్: ఇండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆకట్టుకుంటున్న సౌతాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సెన్ మూడో టెస్టు మూడో రోజైన గురువారం అద్భుత క్యాచ్‌తో అహా అనిపించాడు. ఈ క్యాచ్‌ తర్వాత భారత బ్యాటర్లపై సఫారీ బౌలర్ల ఆధిపత్యం మరింత కొనసాగింది. 33 బంతులు ఆడి క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్న చతేశ్వర్ పుజారా (9) మార్కో జాన్సన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందికి గురైయ్యాడు.


18వ ఓవర్ తొలి బంతిని అతి కష్టం మీద ఎదుర్కొన్న పుజారా రెండో బంతిని ఆడే ప్రయత్నంలో బంతి గ్లౌజుకు తాకి లెగ్ స్లిప్‌లోకి వెళ్లింది. అక్కడ ఫీల్డింగులో ఉన్న కీగన్ పీటర్సన్ మెరుపు వేగంతో స్పందించాడు. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. ఇది చూసిన అభిమానులే కాదు, కామెంటేటర్లు పొమ్మీ ఎంబంగ్వా, సునీల్ గవాస్కర్ కూడా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Advertisement
Advertisement