ఏడాదికి రూ.75వేలు స్కాలర్‌షిప్.. మూడేళ్లపాటు.. వెంటనే అప్లైయ్ చేసుకోండి..!

ABN , First Publish Date - 2021-11-25T17:02:51+05:30 IST

చదువుకోవాలనే ఆసక్తి ఉన్న..

ఏడాదికి రూ.75వేలు స్కాలర్‌షిప్.. మూడేళ్లపాటు.. వెంటనే అప్లైయ్ చేసుకోండి..!

Keep India Smilinging Foundational స్కాలర్‌షిప్‌


కోల్గేట్‌ - పామోలివ్‌ (ఇండియా) లిమిటెడ్‌ ‘కీప్‌ ఇండియా స్మయిలింగ్‌ ఫౌండేషనల్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ను నిర్వహిస్తోంది. పదోతరగతి, ఇంటర్‌ / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు దీనిని ఉద్దేశించారు. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలకు మించకూడదు. ఆసక్తిగల విద్యార్థులు నవంబరు 30 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 


ఇంటర్‌ విద్యార్థులకు: ఈ ఏడాది పదోతరగతిలో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన కాలేజ్‌లో ఇంటర్‌ / పదకొండో తరగతిలో ప్రవేశం పొంది ఉండాలి.

రివార్డ్‌: ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు స్కాలర్‌షిప్‌ ఇస్తారు.


డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంటర్‌ / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన కళాశాలలో మూడేళ్ల డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. 

రివార్డ్‌: ఏడాదికి రూ.30,000 చొప్పున మూడేళ్లు స్కాలర్‌షిప్‌ ఇస్తారు.


క్రీడాకారులకు: గత రెండు, మూడేళ్లలో రాష్ట్ర / జాతీయ / అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం / దేశం తరపున  ఏ క్రీడా విభాగంలోనైనా ప్రాతినిధ్యం వహించి ఉండాలి. దేశవ్యాప్తంగా 500 లోపు, రాష్ట్రవ్యాప్తంగా 100 లోపు ర్యాంకు సాధించి ఉండాలి. జూన్‌ 30 నాటికి 9 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ప్రముఖ క్రీడా సంస్థ / ఫెడరేషన్‌ / అకాడమీ / కోచ్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఉండాలి. 

రివార్డ్‌: ఏడాదికి రూ.75,000 చొప్పున మూడేళ్లు స్కాలర్‌షిప్‌ ఇస్తారు.


ఇంజనీరింగ్‌ విద్యార్థులకు: ఈ ఏడాది ఇంటర్‌ / తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంజనీరింగ్‌ ఫస్టియర్‌లో ప్రవేశం పొంది ఉండాలి. 

రివార్డ్‌: ఏడాదికి రూ.30,000 చొప్పున నాలుగేళ్లు స్కాలర్‌షిప్‌ ఇస్తారు.


సమాజ సేవకులకు: చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పేద పిల్లలకు చదువు చెప్పడం, క్రీడాంశాలలో శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహించి ఉండాలి.

రివార్డ్‌: ఏడాదికి రూ.75,000 చొప్పున రెండేళ్లు ఫౌండేషనల్‌ గ్రాంట్‌ ఇస్తారు.


వెబ్‌సైట్‌: https://colgatecares.co.in/keepindiasmiling/index.html


Updated Date - 2021-11-25T17:02:51+05:30 IST