పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2020-05-18T10:29:49+05:30 IST

ప్రతి ఆదివారం తమ ఇంటి ఆవరణలో ఉదయం వేళలో పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ సిక్తా ప ట్నాయక్‌ అన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

 కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌


పెద్దపల్లి, మే 17(ఆంధ్రజ్యోతి): ప్రతి ఆదివారం తమ ఇంటి ఆవరణలో ఉదయం వేళలో పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ సిక్తా ప ట్నాయక్‌ అన్నారు. ఆదివారం ఉదయం ఆమె కలె క్టర్‌ క్యాంపుకార్యాలయంలో పూలకుండీల కింద అ మర్చిన ప్లేట్లలోగల నీటిని తొలగించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చేది వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు, సీజనల్‌ వ్యాధులు ప్ర బలే అవకాశాలున్నాయని, ఇప్పటినుంచే పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచుకో వాలన్నారు. ప్రతి ఆది వారం ఉదయం 10 గంటలకు పరిసరాలను పరిశు భ్రం చేసుకోవాలని కలెక్టర్‌ జిల్లా ప్రజలను కోరారు.


రామగుండంలో..

కోల్‌సిటీ, మే 17: రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమం నిర్వహించారు. 30వ డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో మేయర్‌ డాక్టర్‌ అనీ ల్‌కుమార్‌, సూపర్‌వైజర్‌ సుగుణాకరెడ్డి తదితరు లు పాల్గొన్నారు. డివిజన్లలో మెప్మా సిబ్బందితో ని ల్వ ఉన్న నీటిని తొలగించే కార్యక్రమాల్లో భాగస్వామ్యులయ్యారు. 44వ డివిజన్‌లో కార్పొరేటర్‌ ము స్తాఫా, 45వ డివిజన్‌లో కొమ్ము వేణు, 25వ డివిజన్‌లో నగునూరి సుమలతరాజు, 26వ డివిజన్‌లో మంచికట్ల దయాకర్‌, 27వ డివిజన్‌లో కల్వల శిరీషసంజీవ్‌, 11వ డివిజన్‌లో పెద్దెల్లి తేజస్వినిప్రకా ష్‌, 12వ డివిజన్‌లో బొడ్డు రజితరవీందర్‌, 13వ డివిజన్‌లో ర్యాకం శ్రీమతిదామోదర్‌, 14వ డివిజన్‌ లో నీల పద్మగణేష్‌, 39వ డివిజన్‌ ప్రగతినగర్‌లో జెట్టి జ్యోతి రమేష్‌, 40వ డివిజన్‌లో దుబాసి లలితమల్లేష్‌, 41వ డివిజన్‌లో గాదం విజయనందు, 50వ డివిజన్‌లో మహాలక్ష్మితిరుపతి ఆధ్వర్యంలో నిల్వ ఉన్న నీటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టా రు. 42వ డివిజన్‌లో బాలరాజ్‌కుమార్‌ డ్రైన్ల పూడి క తీసే కార్యక్రమాన్ని నిర్వహించారు. 


సుల్తానాబాద్‌లో..

సుల్తానాబాద్‌, మే 17 : స్థానిక పదో వార్డులో ప్రతి ఇంటిలో నిలువ ఉన్న నీటిని పారబోయించ డంతో పాటు పరిసరాల పరిశుభ్రత గురించి ము న్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ సునీత, వైస్‌చైర్‌పర్సన్‌ సమత, కౌన్సిలర్లు అరుణ, బాబారా వు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-18T10:29:49+05:30 IST