Abn logo
Mar 27 2020 @ 07:59AM

మహేశ్‌తో మ‌హాన‌టి..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌తో కీర్తిసురేశ్ న‌టించ‌నుందా? అంటే అవున‌నే వార్త‌లు సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతుంది. వివ‌రాల్లోకెళ్తే.. మ‌హేశ్ 27వ సినిమా సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్రారంభం కానుంద‌ట‌. ప‌రుశురామ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ను హీరోయిన్‌గా న‌టింప చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. జూన్ లేదా జూలైలో షూటింగ్‌ను స్టార్ట్ చేసి వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో స‌క్సెస్ సాధించారు మ‌హేశ్‌. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గ‌గానే మ‌హేశ్ 27వ సినిమా ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయ‌ట‌.

Advertisement
Advertisement
Advertisement