రోజుకు 90 లక్షల లీటర్ల నీటినిచ్చే ఆధునిక బావి... ఎక్కడ నిర్మిస్తున్నారంటే...

ABN , First Publish Date - 2021-09-07T12:25:52+05:30 IST

ఢిల్లీలోని కేజ్రీవాస్ సర్కారు రోజుకు...

రోజుకు 90 లక్షల లీటర్ల నీటినిచ్చే ఆధునిక బావి... ఎక్కడ నిర్మిస్తున్నారంటే...

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు రోజుకు 90 లక్షల లీటర్ల నీటిని అందించే ఆధునిక బావిని నిర్మిస్తోంది. ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సోనియా విహార్‌లో నిర్మితమవుతున్న ఈ ఆధునిక బావిని పరిశీలించారు. ఢిల్లీ ప్రభుత్వం, ఇరిగేషన్ అండ్ ఫుడ్ కంట్రోల్(ఐ అండ్ ఎఫ్సీ) సంయుక్తంగా ఈ ఆధునిక బావిని నిర్మిస్తున్నాయి.


ఈ బావిలో నిర్మించే గోడలకు పలు రంధ్రాలు ఉంటాయి. తద్వారా నీటి ఊటంతా బావిలోకి చేరుతుంది ఒకసారి ఈ బావి పూర్తిగా నిండితే, రోజుకు ఈ బావి నుంచి 90 లక్షల లీటర్ల నీరు లభ్యమవుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ బావి నుంచి వచ్చే నీటిని వివిధ రకాల పనులకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి అవసరాలను ఈ బావిలోని నీరు తీరుస్తుందన్నారు. ఆరు మీటర్ల వ్యాసార్థంతో ఈ బావి నిర్మితమవుతోంది. ఈ బావి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరినాటికి ఈ బావి అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. 


Updated Date - 2021-09-07T12:25:52+05:30 IST