పంజాబ్ సీఎం వ్యాఖ్యలను తిప్పి కొట్టిన కెజ్రీవాల్

ABN , First Publish Date - 2021-12-02T23:07:32+05:30 IST

పంజాబ్‌లో గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో నిర్వహించే తిరంగా యాత్రలో కెజ్రివాల్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పఠాన్‌కోట్‌ను బయల్దేరిన ఆయనను మీడియా..

పంజాబ్ సీఎం వ్యాఖ్యలను తిప్పి కొట్టిన కెజ్రీవాల్

చండీగఢ్: తనను నల్లవ్యక్తి, మురికి బట్టలు వేసుకుంటాడని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. తాను మురికి బట్టలే వేసుకుంటానని, తన బట్టలు మురికిగానే ఉంటాయని ఎందుకంటే తాను రోడ్లపై తిరుగుతానని, ప్రజల దగ్గరికి వెళ్తానని, చన్నీలాగ హెలికాఫ్టర్లో తిరగనని ఆయన సెటైర్లు వేశారు. పంజాబ్ అమ్మలు తనలాంటి నలుపు కొడుకును ఇష్టపడతారని, పంజాబ్ సోదరీలు తనలాంటి నలుపు సోదరుడిని ఇష్టపడతారని కెజ్రివాల్ అన్నారు.


పంజాబ్‌లో గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో నిర్వహించే తిరంగా యాత్రలో కెజ్రివాల్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పఠాన్‌కోట్‌ను బయల్దేరిన ఆయనను మీడియా ప్రశ్నించగా ‘‘నేను చన్నీ సర్‌ని చాలా గౌరవిస్తాను. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పడితే పంజాబ్ మహిళలకు నెల నెలా వెయ్యి రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించిన అనంతరం నుంచి అప్పటి నుంచి చన్నీ సర్ నన్ను చాలా చెడు మాటలతో దాడి చేస్తున్నారు. నా బట్టలు మురికిగా ఉంటాయని ఆయన అన్నారు. అవును నా బట్టలు మురికిగానే ఉంటాయి. నాకు దీంతో ఎలాంటి ఇబ్బంది లేదు. నేను పంజాబ్‌లోని ప్రతి తల్లికి, ప్రతి సోదరికి వెయ్యి రూపాయలు ఇస్తాను. వాటితో వారు కొత్త బట్టలు కొంటారు. నా ఆనందం అందులోనే ఉంటుంది. అంతే కాదు, నిన్న ఆయన మాట్లాడుతూ నేను నల్లగా ఉంటానని అన్నారు. అవును నేను నల్లగానే ఉంటాను. ఎందుకంటే నేను భూమిపై ఉన్న ప్రజల దగ్గరికి అడుగు అడుగు తిరుగుతాను. దుమ్ము ధూళి ఉంటుంది. అందులో తిరుగుతాను కాబట్టి నేను నల్లగానే ఉంటాను. చన్నీ సర్‌లా నేను ఆకాశంలో ఉండను, హెలికాఫ్టర్లలో తిరగను. పంజాబ్ అమ్మలు తనలాంటి నలుపు కొడుకును ఇష్టపడతారు. పంజాబ్ సోదరీలు తనలాంటి నలుపు సోదరుడిని ఇష్టపడతారు. నేను నల్లగా ఉంటాను కానీ నా నిజాయితీ నలుపు కాదు. ఈ మురికి బట్టలు వేసుకునే వ్యక్తే, ఈ నలుపు వ్యక్తే హామీలన్నీ నెరవేరుస్తాడని హామీ ఇస్తున్నాను’’ అని కెజ్రీవాల్ అన్నారు.

Updated Date - 2021-12-02T23:07:32+05:30 IST