Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 27 2021 @ 15:21PM

'దేఖో మేరే ఢిల్లీ' మొబైల్ యాప్ రిలీజ్ చేసిన కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ''దేఖో మేరే ఢిల్లీ'' మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారంనాడు ప్రారంభించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీకి వచ్చే పర్యాటకులు ''దేఖో మేరే ఢిల్లీ మొబైల్ యాప్''ను ఉపయోగించుకుని తమ పర్యటనలను ప్లాన్ చేసుకోవచ్చని చెప్పారు. ఢిల్లీలో పర్యటించాలనుకునే ప్రాంతాలకు టిక్కెట్లు కూడా వారు కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. ఈటింగ్ జాయింట్స్, ఫన్ ప్లేసెస్, చారిత్రక స్థలాలు, ఎంటర్‌టైన్‌మెంట్ వెన్యూలకు సబంధించిన సమాచారం యాప్‌లో ఉంటుందని, యాప్ సాయంతో 5 కిలోమీటర్ల లోపు ప్రాంతాలను టూరిస్టులు లొకేట్ చేయవచ్చని తెలిపారు. ఈ యాప్‌తో పర్యాటకరంగం మరింత పుంజుకుంటుదనే నమ్మకం తమకు ఉందని అన్నారు. ఢిల్లీ ప్రజలతో సహా ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కేజ్రీవాల్ కోరారు.

ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ, టూరిస్టుల సంపూర్ణ యాత్రకు ఈ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. ఢిల్లీ విచ్చేసే ప్రపంచ పర్యాటకులకు చక్కటి అనుభూతి కలిగించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ ఒక్క యాప్‌తో పర్యాటకులు ఢిల్లీ సంపూర్ణ యాత్రకు ప్లాన్ చేసుకోవచ్చని చెప్పారు. ''టూరిజం ఉద్దేశం సంతోషంగా గడపడం. టూరిజం ఉంటే సంతోషం ఉంటుంది. సంతోషం ఉంటే టూరిజం ఉంటుంది. దేఖ్ మేరీ ఢిల్లీ అనేది ఇన్విటేషన్ కార్డులాంటింది. ఒకటిన్నర రోజులు ఇక్కడ ఉండాలని వచ్చే పర్యాటకులు రెండున్నర రోజులు ఉండేలా చేయగలగాలి. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం'' అని అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement