ఢిల్లీ ఆస్పత్రులు ఢిల్లీ వారికే : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-06-07T18:25:21+05:30 IST

కరోనా రోగులకు ఆస్పత్రి పడకలు సరిపోవడం లేదన్న గందరగోళంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ

ఢిల్లీ ఆస్పత్రులు ఢిల్లీ వారికే : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : కరోనా రోగులకు ఆస్పత్రి పడకలు సరిపోవడం లేదన్న గందరగోళంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులను కేవలం ఢిల్లీ ప్రజల కోసమే రిజర్వ్ చేశామని, వారి కోసమే పనిచేస్తాయని ఆయన ప్రకటించారు. ఈ విషయంపై తాము సర్వే చేయగా 90 శాతం మంది ప్రజల అభిమతం కూడా ఇలాగే ఉందని ఆయన తెలిపారు. అయితే కేంద్రానికి సంబంధించిన ఆస్పత్రులు మాత్రం అందరికీ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.


న్యూరో సర్జరీ లాంటి ప్రత్యేక శస్త్ర చికిత్సలు చేసే ఆస్పత్రులు తప్ప... మిగిలిన ప్రైవేట్ ఆస్పత్రులన్నీ ఢిల్లీ వారికే కేటాయించబడతాయని వివరించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధ్యక్షతన ఆదివారం ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఐదుగురు డాక్టర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేశాం. జూసన్ చివరి నాటికి ఢిల్లీ 15,000 పడకలు అవసరం ఉందని అంచనా వేశారు. ఇతర రాష్ట్రాల రోగులకు అవకాశం ఇస్తే... మా వద్ద ఉన్న 9,000 పడకలు మూడు రోజుల్లో పూర్తవుతాయని భావిస్తున్నారు’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-07T18:25:21+05:30 IST