జర్నలిస్టులందరికీ ఫ్రీ వ్యాక్సిన్: సర్కార్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-05-08T05:28:55+05:30 IST

ఢిల్లీలోని ప్రతి జర్నలిస్టుకు ఉచిత వ్యాక్సిన్ అందిస్తామని, దాని కోసం ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మేరకు..

జర్నలిస్టులందరికీ ఫ్రీ వ్యాక్సిన్: సర్కార్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రతి జర్నలిస్టుకు ఉచిత వ్యాక్సిన్ అందిస్తామని, దాని కోసం ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన ద్వారా ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలోని ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానికి మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఉచిత వ్యాక్సిన్ అందిస్తామని, దానికోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించింది. మీడియా సంస్థల ఆఫీసుల్లోనే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, దీని ఖర్చులు కూడా ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొంది. 


ఇదిలా ఉంటే వైద్య శాఖ వెల్లడించిన సమాచారం మేరకు.. ఢిల్లీ వ్యాప్తగా గత 24 గంటల్లో కొత్తగా 19,832 కరోనా కేసులు నమోదయ్యాయి. 341 మంది మృతి చెందారు. వీటితో కలుపుకుని ప్రస్తుతం 91,035 మంది కరోనా రోగులకు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,92,867 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గురువారం మొత్తం 1,14,657 మంది లబ్ధిదారులకు టీకాలు వేయగా, వారిలో 80,306 మందికి మొదటి డోసు తీసుకున్నారు.

Updated Date - 2021-05-08T05:28:55+05:30 IST