పరిస్థితి విషమంగా ఉందంటూ ప్రధాని మోదీకి సీఎం కేజ్రీవాల్ లేఖ

ABN , First Publish Date - 2021-04-18T21:18:43+05:30 IST

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని

పరిస్థితి విషమంగా ఉందంటూ ప్రధాని మోదీకి సీఎం కేజ్రీవాల్ లేఖ

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని, దానికి తోడు ఆక్సిజన్ కొరత వేధిస్తోందని అందులో ప్రస్తావించారు. దాదాపు ఐసీయూ బెడ్స్ అన్నీ నిండిపోయాయని పేర్కొన్నారు. అయినా సరే, తమ ప్రయత్నంలో తాము ఉన్నామని, కేంద్రం మద్దతు కూడా కావాలాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ‘‘ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఆస్పత్రుల్లో 10,000 పడకలున్నాయి. అయితే 1800 పడకలను కోవిడ్ కోసమే రిజర్వ్ చేసి ఉంచాం. ఢిల్లీలో కరోనా ఘోరంగా ఉంది. అందుకే కరోనా కోసం 7000 పడకలను రిజర్వ్ చేయాలి. ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగానే ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఢిల్లీలోని డీఆర్డీవోలో ఐసీయూకు సంబంధించి 500 బెడ్లను తయారు చేస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. అయితే మరో 500 పడకలను కూడా తయారు చేయిస్తే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకూ మాకు కేంద్ర సహకారం పూర్తిగా అందుతోంది. మరిన్ని విషయాలపై కూడా మీరు మాకు సహాయం చేయాలని ఆశిస్తున్నాం’’ అంటూ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 



Updated Date - 2021-04-18T21:18:43+05:30 IST