Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరోసారి ఈడీ విచారణకు హాజరైన కెల్విన్

హైదరాబాద్: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడు కెల్విన్‌ మాస్కెరాన్స్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు మరోసారి హాజరైనాడు. నటుడు రానా విచారణలో భాగంగా ఈడీ కార్యాలయానికి కెల్విన్‌‌ను తీసుకువచ్చారు. రానా, కెల్విన్‌లను ఈడీ అధికారులు ప్రశ్నిస్తోన్నారు. కెల్విన్‌తో పాటు పెడలర్ కుద్దుస్‌ కూడా విచారణకు హాజరయ్యాడు. ఆర్థిక లావాదేవీలపై రానా, కెల్విన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 


మూడు గంటలుగా హీరో రానాను ముగ్గురు ఈడీ సభ్యుల బృందం ప్రశ్నిస్తోంది. ఆడిటర్ సతీష్‌తోపాటు అడ్వకేట్‌తో రానా విచారణకు హాజరయ్యాడు. 2015-17లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను రానా సమర్పించాడు. ఈడీ బృందం రానా బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తోంది. బ్యాంక్‌ ఖాతాల్లోని డబ్బుల బదలాయింపుపై ఈడీ ఆరా తీస్తోంది. దుబాయ్‌ ఈవెంట్స్‌లో రానా, కెల్విన్ నగదు లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది. 

Advertisement
Advertisement