కేంద్ర, రాష్ట్ర పాలనలో ప్రజలు అధోగతి

ABN , First Publish Date - 2021-10-22T02:46:32+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో సామాన్యుల పరిస్థితి అధోగతి పాలయ్యిందని ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ సయ్యద్‌ సిరాజ్‌ పే

కేంద్ర, రాష్ట్ర పాలనలో ప్రజలు అధోగతి
మాట్లాడుతున్న ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ సయ్యద్‌ సిరాజ్‌

- ఏఐవైఎఫ్‌ జిల్లా  కన్వీనర్‌

కావలిటౌన్‌, అక్టోబరు21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో సామాన్యుల పరిస్థితి అధోగతి పాలయ్యిందని ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ సయ్యద్‌ సిరాజ్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఎండగట్టేందుకు యువత ముందుకు రావాలన్నారు. అందులో భాగంగా నవంబరు 3న జరిగే  జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ఈ సందర్భంగా కావలిలో మహాసభ జరిపి 29మందితో ఒక కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా వెంకటేష్‌, కార్యదర్శిగా బోస్‌, ఉపాధ్యక్షుడిగా వేణు, సహాయ కార్యదర్శిగా మహేష్‌, కోశాదికారిగా రాజేష్‌ మరికొంత మంది కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ కార్యక్రమంలో బాబు, రాజేష్‌, వేణు, మదన్‌, అజయ్‌, శ్రీనివాసులు, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-22T02:46:32+05:30 IST