ఆటామేకర్ యాడ్‌పై కెంట్ క్షమాపణ

ABN , First Publish Date - 2020-05-29T22:11:18+05:30 IST

పబ్లిసిటీ కోసం తయారుచేసే యాడ్లు కొన్ని సార్లు ఆయా కంపెనీలకు పెద్ద తలనెప్పులను...

ఆటామేకర్ యాడ్‌పై కెంట్ క్షమాపణ

న్యూఢిల్లీ: పబ్లిసిటీ కోసం తయారుచేసే యాడ్లు కొన్ని సార్లు ఆయా కంపెనీలకు పెద్ద తలనెప్పులను తెచ్చిపెడతాయి. అలాంటి పరిస్థితినే ఇప్పుడు కెంట్ కంపెనీ ఎదుర్కొంటోంది. ఇటీవల ఆ సంస్థ ఓ ఆటా, బ్రెడ్ మేకర్ యాడ్‌ను విడుదల చేసింది. ఇళ్లలో పనిచేసే వారిని అనుమతించవద్దని, వారి చేతులకు ఇన్ఫెక్షన్ ఉండవచ్చని చెప్పే ఉద్దేశంతో ఈ యాడ్ ఉంటుంది. దీంతో దీనిపై అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. వివక్షణాత్మకమైన ఈ యాడ్‌ను వెంటనే తొలగించాలని కెంట్ సంస్థను డిమాండ్ చేశారు.


ఈ నేపథ్యంలో సంస్థ యాజమాన్యం ప్రజలకు క్షమాపణ చెప్పింది. తమ యాడ్‌ను తొలగిస్తున్నామని, దానిని విడుదల చేసినందుకు మన్నించాలని కోరింది. ఎవరినీ కించపరిచేందుకు ఈ యాడ్ తీయలేదని, కేవలం శభ్రత గురించి మాత్రమే చెప్పేందుకు ప్రయత్నించామని సంస్థ చైర్మన్ మహేశ్  గుప్తా ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.

Updated Date - 2020-05-29T22:11:18+05:30 IST