మీ డైట్‌లో బాదములు ఉండేలా చూసుకోండి

ABN , First Publish Date - 2020-06-20T00:01:19+05:30 IST

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం ఎంతో అవసరం. ముఖ్యంగా పౌష్ఠికాహారం లభించకపోతే అనేక ఆరోగ్య సమస్యలు...

మీ డైట్‌లో బాదములు ఉండేలా చూసుకోండి

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం ఎంతో అవసరం. ముఖ్యంగా పౌష్ఠికాహారం లభించకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సరైన డైట్ ప్లాన్ కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా బాదం రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఇటీవల యోగాను అందరూ ఆచరిస్తున్నారు. యోగా వల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండడం, ధృడమైన శరీరాన్ని సాధించడం యోగాలో భాగం. ముఖ్యంగా ఆహారం విషయంలో సరైన డైట్ పాటించాలి. సంపూర్ణమైన ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భారీగా యోగా ప్రదర్శనలను సైతం జరుపుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఒకే చోటకు వచ్చి యోగా చేస్తుంటారు. ఇంతమంది యోగాపై మక్కువ చూపడం ఎంతో సంతోషించదగ్గ విషయం.  అయితే ఈ యోగాకు తోడు సరైన డైట్ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. దానివల్ల మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు.  డైట్‌లో ఓ గుప్పెడు బాదం జోడించడం వల్ల మంచి ఫలితాలను సాధించవచ్చు. తరచుగా వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య పరంగా సానుకూల ప్రభావం కలుగుతుంది. దీనితో పాటుగా, బాదములలో విటమిన్ బీ12, మెగ్నీషియం, ఫాస్పరస్ తదితర పోషకాలూ ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవనశైలికి ఇవి సహాయపడతాయి.


దీనిపై బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మాట్లాడుతూ ‘సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండడానికి యోగా గొప్ప మార్గం. ఇది శరీరం మీద మాత్రమేకాక మనస్సు మీద కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. యోగా సాధనను ప్రశంశిస్తూ నేను కూడా ఆరోగ్యవంతమైన డైట్‌ను అనుసరిస్తున్నాను. ప్రతి రోజూ ఓ గుప్పెడు బాదం తీసుకోవడమూ చేస్తుంటాను. బాదములను సాత్విక ఆహారంగా భావిస్తుంటారు. వీటిలో అత్యంత కీలకమైన పోషకాలు అయినటువంటి ప్రొటీన్, విటమిన్-ఈ, మెగ్నీషియం మొదలైనవి ఉన్నాయి. బాదములు అదనంగా శక్తిని సైతం అందిస్తాయి. ఆయుర్వేదం చెప్పేదాని ప్రకారం శరీర కణజాల టోనింగ్‌కు ఇవి సహాయపడతాయి'' అని తెలిపారు.


న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్, షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘భారతదేశంలో, ఇప్పుడు సనాతన సంప్రదాయాలను అనుసరించాలనే ఆసక్తి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా వ్యాయామాలు లేదా ఆహార తయారీ పరంగా ! వీటి ద్వారానే జీవనశైలి వ్యాధులను అడ్డుకోవచ్చని వారు భావిస్తున్నారు. యోగాను సాధన చేయడంతో పాటుగా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. పోషకాలు అధికంగా కలిగినటువంటి బాదములను డైట్‌లో జోడించడం ద్వారా దానిని ఆరంభించవచ్చు. బరువు నియంత్రించడంలో బాదములు సహాయపడతాయి మరియు అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం ప్రతి రోజూ 42 గ్రాముల బాదములను తీసుకుంటే, నడుం దగ్గర కొవ్వు తగ్గడంతో పాటుగా నడుం చుట్టుకొలత కూడా తగ్గుతుంది'’ అని అన్నారు.


ఫిట్‌నెస్‌తో ఆరోగ్యవంతమైన డైట్‌ను మిళితం చేయాల్సిన ఆవశ్యకతపై ఫిట్‌నెస్ ప్రియుడు, సూపర్‌మోడల్ మిలింద్ సోమన్ మాట్లాడుతూ "యోగా శక్తిని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. కానీ, సరైన రీతిలో దానిని సాధన చేస్తూనే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే మీరు చేసిన వ్యాయామాల అత్యుత్తమ ప్రయోజనాలు పొందగలం. ఫ్రైడ్ స్నాక్స్ లేదంటే అనారోగ్యవంతమైన ఆహారానికి బదులుగా ఆరోగ్యవంతమైన ఆహారం అయినటువంటి బాదములు తీసుకోవడానికి నేను ప్రాధాన్యతనిస్తుంటాను. బాదములు తేలికైనవి, సులభంగా తీసుకువెళ్లదగినవి. భోజనాల నడుమ తినడానికి అత్యుత్తమ స్నాక్‌గా వీటని మలుచుకోవచ్చు'' అని చెప్పారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన, ఆరోగ్యవంతమైన డైట్‌తో పాటుగా మరిన్ని యోగా సెషన్‌లలో పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రతిజ్ఞ చేద్దాం!

Updated Date - 2020-06-20T00:01:19+05:30 IST