కేరళలో జూన్ 7 నుంచి కొవిడ్ కొత్త మార్గదర్శకాలు అమలు

ABN , First Publish Date - 2021-06-01T11:24:27+05:30 IST

కేరళలో జూన్ 7 నుంచి కొవిడ్ కొత్త మార్గదర్శకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....

కేరళలో జూన్ 7 నుంచి కొవిడ్ కొత్త మార్గదర్శకాలు అమలు

50 శాతం ఉద్యోగులతో ప్రభుత్వ కార్యాలయాలు

తిరువనంతపురం (కేరళ):కేరళలో జూన్ 7 నుంచి కొవిడ్ కొత్త మార్గదర్శకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేరళ రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉన్నా జూన్ 7వతేదీ నుంచి 50 శాతం ఉద్యోగులతో రొటేషన్ పద్ధతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్రప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు పనిచేసేందుకు అనుమతిస్తూ కేరళ సర్కారు తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.కొత్త మార్గదర్శకాల్లో మార్నింగ్ వాక్ తెల్లవారుజామున 5 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం వాకింగ్ 7 నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతించాలని ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. పరిశ్రమలు పనిచేసేందుకు అనుమతించారు. సర్వీస్ సెక్టారు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించారు.జూన్ 9వ తేదీ వరకు లాక్‌డౌన్ కేరళ సర్కారు పొడిగించింది. 

Updated Date - 2021-06-01T11:24:27+05:30 IST