కేరళలో మొదలైన ఆన్‌లైన్ క్లాసులు.. తొలి రోజు 45 లక్షల మంది హాజరు

ABN , First Publish Date - 2020-06-01T21:38:55+05:30 IST

లాక్‌డౌన్ నడుమ కేరళలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. నేడు దాదాపు 45 లక్షల

కేరళలో మొదలైన ఆన్‌లైన్ క్లాసులు.. తొలి రోజు 45 లక్షల మంది హాజరు

తిరువనంతపురం: లాక్‌డౌన్ నడుమ కేరళలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. నేడు దాదాపు 45 లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యారు. స్టేట్ జనరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ‘ఫస్ట్‌బెల్’ పేరుతో విక్టర్స్ చానల్ ద్వారా 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు. ప్రతి రోజు ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5:30 క్లాసులు జరగనున్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సందేశంతో ఈ క్లాసులు ప్రారంభమయ్యాయి.


కరోనా మహమ్మారి కారణంగా క్లాసులను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్టు సీఎం తెలిపారు. పిల్లలు ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక దూరం పాటించి సాధారణ తరగతులు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఒకవేళ తరగతులు నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. అయినప్పటికీ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చదువులు కొనసాగిస్తామని సీఎం వివరించారు.  

Updated Date - 2020-06-01T21:38:55+05:30 IST