కేరళలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2022-01-23T02:56:11+05:30 IST

కేరళలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

కేరళలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం రోజు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొత్తగా 45,136 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 55,74,702 చేరుకుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు ఇప్పుడు 44.8 శాతంగా ఉంది. కేరళలో శుక్రవారం 1,668 తాజాగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గురువారం 46,387 కేసులు నమోదైన ఒక రోజు తర్వాత, 2020లో మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి అత్యధికంగా ఒక్కరోజులోనే అధిక కోవిడ్ కేసులు నమోదైనట్లు కేరళ సర్కారు తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,00735 కోవిడ్ పరీక్షలు చేశారు. కేరళలో 2,47,227 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా శనివారం 21,324 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 52,97,971 చేరుకుంది. కేరళలో ఈరోజు 132 మరణాలు నమోదయ్యాయి, మరణాల సంఖ్య 51,739 చేరుకుంది. వచ్చే రెండు ఆదివారాల్లో లాక్‌డౌన్ లాంటి పరిమితులను విధించాలని కేరళ ప్రభుత్వం గురువారం రోజు నిర్ణయించింది. అవసరమైన సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని కేరళ సర్కారు తెలిపింది.

Updated Date - 2022-01-23T02:56:11+05:30 IST