Sabarimalaలో అయ్యప్ప భక్తులకు శుభవార్త

ABN , First Publish Date - 2021-12-11T12:44:34+05:30 IST

శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది....

Sabarimalaలో అయ్యప్ప భక్తులకు శుభవార్త

కొవిడ్ ఆంక్షల సడలింపు...యాత్రికుల రాత్రి బసకు అనుమతి

తిరువనంతపురం: శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. శబరిమల యాత్రపై కొవిడ్ ఆంక్షలను మరింత సడలిస్తూ, భక్తులు రాత్రిపూట బస చేసేందుకు అనుమతిస్తున్నట్లు కేరళ సీఎం విజయన్ తాజాగా ప్రకటించారు.కేరళ రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో శబరిమల యాత్రకు సంబంధించిన ఆంక్షలను మరింత సడలిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. సీఎం విజయన్, దేవదాయశాఖ మంత్రి కే రాధాకృష్ణన్‌లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.సవరించిన మార్గదర్శకాల ప్రకారం అయ్యప్ప భక్తులు ఇప్పుడు సన్నిధానంలో రాత్రిపూట బస చేసేందుకు అనుమతిస్తారు. 


యాత్రికుల బస చేసేందుకు 500 గదులు ఏర్పాటు చేశారు. కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరారు.అలాగే పంబ నుంచి నీలిమల, అప్పాచిమేడు, మరకూటం వరకు రహదారిని కూడా తెరుస్తారు. యాత్రికుల కోసం నీలిమల, అప్పచిమేడులలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.భక్తులు పంపా నదిలో స్నానం చేయవచ్చు.అయితే పంపా నదిలో నీటి మట్టాన్ని పరిశీలించిన తర్వాత జిల్లా యంత్రాంగం దీనిపై తదుపరి నిర్ణయం తీసుకోనుంది.


Updated Date - 2021-12-11T12:44:34+05:30 IST