కేరళలో కరోనా కేసుల పెరుగుదలకు కారణం చెప్పిన కేంద్ర బృందం!

ABN , First Publish Date - 2021-08-03T15:37:00+05:30 IST

కేరళలో కరోనా కేసుల పెరుగుదలకు కారణాలను...

కేరళలో కరోనా కేసుల పెరుగుదలకు కారణం చెప్పిన కేంద్ర బృందం!

న్యూఢిల్లీ: కేరళలో కరోనా కేసుల పెరుగుదలకు కారణాలను తెలుసుకునేందుకు ఆ రాష్ట్రంలో అధ్యయనం చేపట్టిన కేంద్ర ఉన్నతస్థాయి బృందం పలు వివరాలు వెల్లడించింది. కేరళలో హోంఐసోలేషన్‌లో ఉన్న బాధితులపై సరైన నిఘా లేనందునే కేసులు పెరుగుతున్నాయని తేల్చిచెప్పింది. అందుకే హోం ఐసోలేషన్‌లో ఉన్నబాధితులను గుర్తించి, వైద్యాధికారులు వారిని ఆసుపత్రులలో చేర్పించే ప్రయత్నం చేస్తే, కేసులు అదుపులోకి వస్తాయని బృందం సూచించింది. అలాగే పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరోనా కట్టడి చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపింది. కాగా ఈద్ తరువాత మైనారిటీలు ఉన్న జిల్లాల్లో కేసులు పెరిగినట్లు గుర్తించామని ఈ జిల్లాలో పాజిటివిటీ రేటు ఆరు శాతానికి పైగా ఉన్నట్లు బృందం తెలిపింది.

Updated Date - 2021-08-03T15:37:00+05:30 IST