Keralaలో రికార్డు స్థాయిలో కరోనా..వారం రోజుల్లో 200 శాతం పెరిగిన కేసులు

ABN , First Publish Date - 2022-01-22T13:46:23+05:30 IST

కేరళ రాష్ట్రంలో కేవలం వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవడం సంచలనం రేపింది...

Keralaలో రికార్డు స్థాయిలో కరోనా..వారం రోజుల్లో 200 శాతం పెరిగిన కేసులు

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో కేవలం వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవడం సంచలనం రేపింది. కేరళ రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 41,668కి పెరిగింది. కరోనాతో 106 మంది మరణించారు. గత వారంతో పోలిస్తే 206 శాతం కొవిడ్ కేసులు పెరిగాయి. కరోనాతో ఆసుపత్రిలో చేరిన రోగుల శాతం 80 శాతం పెరిగింది. కొత్తగా 54 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి.కొవిడ్ పాజిటివ్ కేసుల్లో తిరువనంతపురం నగరం అగ్రస్థానంలో ఉంది. తిరువనంతపురంలో 7,896 పాజిటివ్ కేసులు, ఎర్నాకుళంలో 7,339, కోజికోడ్ లో 4,143, త్రిసూర్ లో 3,667, కొట్టాయంలోలో 3,182, కొల్లాంలో 2,660, పాలక్కాడ్ జిల్లాలో 2,345, వాయనాడ్ లో 850 కరోనా కేసులు వెలుగు చూశాయి. 


గడచిన 24 గంటల్లో 95,218 మందికి కరోనా పరీక్షలు చేయగా, అధిక పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.ఫీల్డ్‌ ఆసుపత్రుల్లో 126 శాతం, ఐసీయూలో 56 శాతం, వెంటిలేటర్‌ ఆక్యుపెన్సీలో 18 శాతం రోగులు పెరిగారు. ఆక్సిజన్ సరఫరా ఉన్న పడకలలో కొవిడ్ రోగుల సంఖ్య కూడా 77 శాతం పెరిగింది. కేరళలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో 18 ఏళ్లు పైబడిన వారిలో 100 శాతం మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చామని, మొత్తం జనాభాలో 83 శాతం మందికి రెండు డోసులు ఇచ్చామని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శనివారం తెలిపారు.

Updated Date - 2022-01-22T13:46:23+05:30 IST