ఓ సారి కలవొచ్చు కదా.. అంటూ టిక్‌టాక్‌ ఫ్రెండ్ అడగడంతో సరేనందా యువతి.. అదే ఆమె పాలిట శాపమైందిలా..!

ABN , First Publish Date - 2021-09-11T19:49:08+05:30 IST

ఆమెకు టిక్‌టాక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.. ఆ పరిచయం స్నేహంగా మారింది..

ఓ సారి కలవొచ్చు కదా.. అంటూ టిక్‌టాక్‌ ఫ్రెండ్ అడగడంతో సరేనందా యువతి.. అదే ఆమె పాలిట శాపమైందిలా..!

ఆమెకు టిక్‌టాక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.. ఆ పరిచయం స్నేహంగా మారింది.. తరచుగా ఫోన్‌లో మాట్లాడుకునేవారు.. ఒకసారి కలుద్దామని అతడు అడగడంతో ఆమె సరేనంది.. 300 కిలోమీటర్లు ప్రయాణించి అతడి వద్దకు వెళ్లింది.. అదే ఆమె పాలిట శాపంగా మారింది.. ఆమె నమ్మిన వ్యక్తి అత్యంత దారుణంగా మోసగించాడు.. మరికొందరితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. కేరళలోని కోజికోడ్‌లో ఈ ఘటన జరిగింది. 


దక్షిణ కేరళలోని కొల్లంకు చెందిన 28 ఏళ్ల యువతికి రెండేళ్ల క్రితం టిక్‌టాక్ ద్వారా కోజికోడ్‌కు చెందిన ఆనస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వారిద్దరూ ఫోన్ ద్వారా మాట్లాడుకునేవారు. ఒకసారి కలుద్దామని ఆనస్ అడగడంతో బాధిత యువతి గురువారం కొల్లం నుంచి బయలుదేరి కోజికోడ్ చేరింది. అక్కడ ఆమెను రిసీవ్ చేసుకున్న ఆనస్ ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే ఆ ఫ్లాట్‌లో అతడి ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. వారందరూ కలిసి బాధిత యువతికి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

ఏరా.. పోరా.. అనే పదాలు వాడొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశాలు..!




పదేళ్ల కొడుకు.. 6 నెలల నుంచి కనిపించడం లేదంటూ ఓ తల్లి ఫిర్యాదు.. పోలీసులకు వచ్చిన ఆ ఒక్క డౌట్‌తో సీన్ రివర్స్..!


అనంతరం ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను వీడియో తీశారు. అనంతరం ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్ సమీపంలో వదులుతూ.. `ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామ`ని బెదిరించారు. అయితే హాస్పిటల్ సిబ్బంది యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్పిటల్‌కు చేరుకున్న పోలీసులు బాధిత మహిళ నుంచి స్టేట్‌మెంట్, నిందితుడి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా ఆనస్‌ను అరెస్ట చేశారు. మిగిలిన ముగ్గురి గురించి గాలిస్తున్నారు. 

Updated Date - 2021-09-11T19:49:08+05:30 IST