Abn logo
Sep 26 2021 @ 23:57PM

కులగణాంకాలపై నాటకాలాడుతున్న ప్రభుత్వాలు

సమావేశంలో మాట్లాడుతున్న కేసన

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన

దుగ్గిరాల, సెప్టెంబరు 26: దేశంలో బీసీ కుల గణాంకాలను చేయకుండా ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘీయుల ఆత్మీయ సమావేశం కేఆర్‌ కొండూరులోని శ్రీమహంకాళీ అమ్మవారి ఆలయం వద్ద  సపోటాతోటల్లో ఆదివారం నిర్వహించారు. శంకరరావు మాట్లాడుతూ. దేశంలో 99ఏళ్లుగా బీసీ జనగణాంకాలు చేపట్టలేదన్నారు. బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటుబ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ద్వారా కులగణాంకాలను తక్షణమే చేపట్టేలా ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి ఆదేశాలు జారీచేయాలన్నారు.  యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌ మాట్లాడుతూ, బీసీల సంక్షేమం కోసం పాటుపడిన ప్రభుత్వాలకే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు పట్టంకడతారని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పరసా రంగనాథ్‌ మాట్లాడుతూ, పక్షులు, జంతువుల లెక్కలు కూడా బయటికి తీస్తున్న ప్రభుత్వాలు, బీసీల జనాభాను మాత్రం కులాలవారీగా లెక్కలు ప్రకటించడం లేదన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి ఉందని అన్ని రాజకీయపార్టీలు చెబుతున్నాయని, బీసీలను మాత్రం చిన్నచూపు చూస్తున్నాయన్నారు. రాష ్ట్రకోఆర్డినేటర్‌ గోనుగుంట్ల హనుమంతరావు మాట్లాడుతూ, అక్టోబరు 6న బీసీలందరూ సమైక్యంగా నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ఉద్యోగుల బీసీ విభాగం అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, రాష్ట్ర కోఆర్డినేటర్‌ గోనుగుంట్ల బ్రహ్మానందశర్మ,  జూపల్లి వెంకటేశ్వరరావు, పలువురు నియోకవర్గ, మండల బీసీ సంక్షేమ సంఘ నేతలు పాల్గొన్నారు.