కేశవ్‌ హ్యాట్రిక్‌.. ఓటమి దిశగా వెస్టిండీస్‌

ABN , First Publish Date - 2021-06-22T05:54:45+05:30 IST

స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ హ్యాట్రిక్‌ (3/15)తో చెలరేగడంతో ఆతిథ్య వెస్టిండీస్‌ రెండో టెస్టులోనూ

కేశవ్‌ హ్యాట్రిక్‌.. ఓటమి దిశగా వెస్టిండీస్‌

గ్రాస్‌ ఐలెట్‌: స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ హ్యాట్రిక్‌ (3/15)తో చెలరేగడంతో ఆతిథ్య వెస్టిండీస్‌ రెండో టెస్టులోనూ పరాజయం దిశగా సాగుతోంది. టెస్టుల్లో హ్యాట్రిక్‌ తీసిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్‌గా కేశవ్‌ రికార్డు సృష్టించాడు. కాగా, నాలుగోరోజైన సోమవారం విండీస్‌.. కడపటి సమాచారం అందేసరికి 55 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. కరీబియన్‌ జట్టు విజయానికి ఇంకా 176 రన్స్‌ చేయాలి. క్రీజులో రోచ్‌ (19), జైడెన్‌ (1) ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 73/7తో 4వరోజు బ్యాటింగ్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 298, వెస్టిండీస్‌ 149 రన్స్‌ చేశాయి.


Updated Date - 2021-06-22T05:54:45+05:30 IST