కొవిడ్‌తో కేశవ ప్రసాద్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-08T09:05:24+05:30 IST

కూచిపూడి నాట్యాచార్యులు, అఖిల భారత కూచిపూడి నాట్యకళా మండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్‌ కొవిడ్‌తో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

కొవిడ్‌తో కేశవ ప్రసాద్‌ మృతి

అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి కార్యదర్శిగా ప్రసిద్ధి

కూచిపూడి, మే 7: కూచిపూడి నాట్యాచార్యులు, అఖిల భారత కూచిపూడి నాట్యకళా మండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్‌ కొవిడ్‌తో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఆయన మృతి వార్తతో కూచిపూడి నాట్యంతో అనుబంధం ఉన్న దేశ, విదేశాల్లోని కళాకారులు కలత చెందారు. కూచిపూడి నాట్య కుటుంబంలో పుట్టిన కేశవప్రసాద్‌ తిరుపతి విశ్వవిద్యాలయంలో బీఏ సంస్కృతం చదివారు. నాట్యంపై మక్కువతో అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలిని స్థాపించి ప్రతీ ఏటా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కూచిపూడి శ్రీ సిద్దేంద్ర కళావేదికపై వారం రోజులపాటు నిర్వహించే ఈ నాట్యోత్సవాలకు దేశ, విదేశాలకు చెందిన కళాకారులను ఆహ్వానించి, ప్రదర్శనలు ఇప్పించి, వారిని సత్కరించి ప్రోత్సహిస్తున్నారు. కేశవ ప్రసాద్‌ మృతి కళారంగానికి తీరని లోటని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌, పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-08T09:05:24+05:30 IST