Abn logo
Apr 8 2020 @ 21:01PM

మరో అవకాశాన్ని దక్కించుకున్న హాట్ బ్యూటీ

పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం ‘రొమాంటిక్‌’. పూరి త‌న‌యుడు ఆకాశ్ పూరి హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. ఆకాశ్ స‌ర‌స‌న ఢిల్లీ పోరి కేతికా శ‌ర్మ‌ను న‌టిస్తోంది. కొత్త హీరోయిన్స్‌ను ప‌రిచ‌యం చేయ‌డంలో ముందుండే పూరి.. మ‌రోసారి త‌న నిర్మాణంలో రానున్న ‘రొమాంటిక్‌’ ద్వారా కేతికా శ‌ర్మ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌లో కేతికా త‌న హాటు అందాల‌తో కుర్ర‌కారును ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు తొలి చిత్రం ‘రొమాంటిక్’ విడుదల కాకపోయినా.. ఈ హాట్‌ బ్యూటీకి హీరో నాగ‌శౌర్య‌, ‘సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం’ ఫేమ్ సంతోష్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంద‌ట‌.

Advertisement
Advertisement
Advertisement