Advertisement
Advertisement
Abn logo
Advertisement

కీటో బటర్‌ పనీర్‌

కీటో డైట్‌కు సై!

బరువు తగ్గాలి. శరీరానికి తగిన ప్రొటీన్లు అందాలి. అంటే కీటో డైట్‌ ఫాలో కావాల్సిందే. కీటో దోశ, పోహా, దాల్‌ మఖాని, కొబ్బరి అన్నం, కీటో రోటీలు ఆ కోవకు చెందినవే. కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటీన్లు సమృద్ధిగా లభించే ఈ రెసిపీలను మీరూ ప్రయత్నించి చూడండి.


కావలసినవి: పనీర్‌ - 200గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో ప్యూరీ - పావుకప్పు, వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌, కసూరి మేతి - ఒక టీస్పూన్‌, బిర్యానీ ఆకు - ఒకటి, పసుపు - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, క్రీమ్‌ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా వేడి అయ్యాక పనీర్‌ ముక్కలను వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాత్రను పెట్టి వెన్న వేసి వేడి అయ్యాక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగించాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత ధనియాల పొడి, కారం, పసుపు, గరంమసాల, ఉప్పు వేసి కలియబెట్టాలి. కాసేపు వేగిన తరువాత టొమాటో ప్యూరీ వేసి మరికాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి పదినిమిషాలు ఉడికించాలి. తరువాత వేగించి పెట్టుకున్న పనీర్‌ ముక్కలు వేసి కలపాలి. మెంతి ఆకుల పొడి వేసుకోవాలి. ఒక టేబుల్‌ స్పూన్‌ క్రీమ్‌ వేసి కలపాలి. కాసేపయ్యాక స్టవ్‌పై నుంచి దింపుకోవాలి. మిగిలిన క్రీమ్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


ఆవాల ఆకుల కర్రీ కాజూ మసాలా ఆలూ మేతీసాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌మేథీ బాజీకరివేపాకు చట్నీకరివేపాకు కర్రీచోలే రాజ్మా కర్రీసోయా బీన్‌ ఆలూ కూర్మామునగకాయ థోరన్‌
Advertisement