కీటో రోటీ

ABN , First Publish Date - 2021-08-14T17:37:21+05:30 IST

అవిసె గింజల పొడి - ఒకటిన్నర కప్పు (అవిసెలను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి), మెంతి ఆకుల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, పసుపు - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, అల్లం పేస్టు - అర టీస్పూన్‌, నూనె - కొద్దిగా.

కీటో రోటీ

కావలసినవి: అవిసె గింజల పొడి - ఒకటిన్నర కప్పు (అవిసెలను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి), మెంతి ఆకుల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, పసుపు - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, అల్లం పేస్టు - అర టీస్పూన్‌, నూనె - కొద్దిగా.


తయారీ విధానం: ఒక పాత్రలో నీళ్లు తీసుకుని కసూరి మేతి వేసి కలపాలి. తరువాత అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, అల్లంపేస్టు వేసి కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక ప్లేట్‌లో అవిసె గింజల పొడి తీసుకుని మెంతి ఆకుల పొడి కలిపిన నీళ్లు పోసుకుంటూ చిక్కటి మిశ్రమంలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టాలి. తరువాత మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేత్తో రోటీలా ఒత్తుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసుకుంటూ రోటీలు రెండు వైపులా కాల్చుకుని చట్నీతో వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-08-14T17:37:21+05:30 IST