వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఐర్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కెవిన్ ఒ బ్రియన్

ABN , First Publish Date - 2021-06-19T00:08:55+05:30 IST

ఐర్లాండ్ ఆల్ రౌండర్ కెవిన్ ఒ బ్రియెన్ వన్డే కెరియర్‌కు ముగింపు పలికాడు. ఈ మేరకు క్రికెట్ ఐర్లాండ్

వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఐర్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కెవిన్ ఒ బ్రియన్

న్యూఢిల్లీ: ఐర్లాండ్ ఆల్ రౌండర్ కెవిన్ ఒ బ్రియన్ వన్డే కెరియర్‌కు ముగింపు పలికాడు. ఈ మేరకు క్రికెట్ ఐర్లాండ్ నేడు ప్రకటించింది. వన్డేలకు వీడ్కోలు పలికినప్పటికీ టెస్టులు, టీ20లకు అందుబాటులో ఉంటాడని తెలిపింది. 37 ఏళ్ల కెవిన్ 153 మ్యాచుల్లో 3,618 పరుగులు చేశాడు. ఫలితంగా అత్యధిక పరుగులు చేసిన మూడో ఐర్లండ్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అతడి సగటు 29.41 కాగా, స్ట్రైక్ రేట్ 88.72.  బౌలింగులో 114 వికెట్లు తీసుకున్నాడు. 68 క్యాచ్‌లు అందుకుని వన్డేల్లో అత్యధిక వికెట్లు, క్యాచ్‌లు అందుకున్న తొలి ఐర్లండ్ ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన కెవిన్.. 15 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత తాను సరైన నిర్ణయమే తీసుకున్నట్టు చెప్పాడు.  


Updated Date - 2021-06-19T00:08:55+05:30 IST