ఇండియా నుంచి వచ్చిన ఫొటోలు చూసి ఎంతో ఆవేదన కలిగింది: పీటర్‌సన్

ABN , First Publish Date - 2020-06-05T00:28:47+05:30 IST

కేరళలోని మలప్పురం జిల్లాలో గర్భంతో ఉన్న ఏనుగును పైనాపిల్ బాంబుతో చంపిన విషయం తెలిసిందే. ఆకలితో గ్రామంలోకి ప్రవేశించిన గర్భంతో ఉన్న ఏనుగు ఆహారం

ఇండియా నుంచి వచ్చిన ఫొటోలు చూసి ఎంతో ఆవేదన కలిగింది: పీటర్‌సన్

కేరళలోని మలప్పురం జిల్లాలో గర్భంతో ఉన్న ఏనుగును పైనాపిల్ బాంబుతో చంపిన విషయం తెలిసిందే. ఆకలితో గ్రామంలోకి ప్రవేశించిన గర్భంతో ఉన్న ఏనుగు ఆహారం కోసం వెతికింది. అయితే కొందరు ఆకతాయిలు దానికి పైనాపిల్‌లో బాంబులు కూర్చి ఆహారంగా అందించారు. అయితే దాన్ని ఏనుగు నోట్లో పెట్టుకోగానే పేలిపోయింది. ఆ బాధని భరించలేక అది వెల్లియార్ నదిలోకి అక్కడే కాసేపు నిలబడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటనకు కారకులైన ప్రతీ ఒక్కరిని కఠింగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


అయితే ఈ దుర్ఘటనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, జంతు ప్రేమికుడు అయిన కెప్టెన్ పీటర్‌సన్ స్పందించాడు. ఏనుగు మృతి చెందిన ఫొటోలు చూస్తుంటే ఎంతో ఆవేదన కలిగిందని అతను అన్నాడు. ‘‘తల్లి ఏనుగుతో జరిగిన ఈ దారుణ హింసకు సంబంధించి భారత్‌ నుంచి వచ్చిన ఈ ఫొటోలను చూస్తుంటే.. ఎంతో ఆవేదన కలిగింది. అసలు ఎవరైనా ఇలా చేయాలని ఎందుకు అనుకుంటారో..? ఎందుకు?’’ అంటూ కెవిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

Updated Date - 2020-06-05T00:28:47+05:30 IST