Abn logo
Jul 9 2020 @ 22:32PM

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం నుంచి..

శ్రీకాకుళం: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 10వ తేదీ, శుక్రవారం నుంచి శ్రీకాకుళం పట్టణంలో దుకాణాలకు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలు బయట తిరగరాదని, ఉదయం బయటకు వచ్చేవారు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. జిల్లాలో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జె.నివాస్ హెచ్చరించారు. 

Advertisement
Advertisement
Advertisement