Oct 21 2021 @ 14:03PM

Srinidhi shetty : ‘కేజీఎఫ్ 2’ టీమ్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

‘కేజీఎఫ్’ చాప్టర్ 1 మూవీతో పాన్ ఇండియా స్థాయిలో అందరి మనసులు దోచుకుంది అందాల శ్రీనిధిశెట్టి. రాక్ స్టార్ యశ్ తో అమ్మడి స్ర్కీన్ ప్రెసెన్స్ కు మంచి మార్కులు పడడంతో ‘కేజీఎఫ్’ సీక్వెల్ లోనూ ఆమె కథానాయికగా కొనసాగుతోంది. శాండిల్ వుడ్ చరిత్రలోనే హైయస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇందులో శ్రీనిథి శెట్టి పాత్ర చాలా రెబల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్బంగా.. అభిమానుల నుంచి సినీ ప్రముఖుల నుంచి ఆమెకు విషెస్ అందాయి. ఈ నేపథ్యంలో  కేజీఎఫ్ టీమ్ సైతం అమ్మడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 



శ్రీనిధి శెట్టి ఫోటోను షేర్ చేస్తూ.. ‘కేజీఎఫ్ 2’ లో రీనా దేశాయ్ గా నటిస్తోన్న మా కిల్లర్ లేడీ శ్రీనిధి శెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇందులో ఆమె ప్రేమిస్తుందా, వంచిస్తుందా.. ఇంకేం చేస్తుందా? అని తెలుసుకోడానికి చాలా ఆత్రుతగా ఉన్నారు ప్రేక్షకులు అంటూ వ్యాఖ్యను జోడించారు. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా రవీనా టండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, సోనూ గౌడ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానున్న ‘కేజీఎఫ్ 2’ మూవీ మొదటి భాగాన్ని మించి హిట్టవుతుందేమో చూడాలి.