కేజీహెచ్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ సంఘం అధ్యక్షుడిగా సూరిబాబు

ABN , First Publish Date - 2020-12-05T05:39:24+05:30 IST

కేజీహెచ్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అండ్‌ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అర్బన్‌ కమిటీ అధ్యక్షుడిగా డి.సూరిబాబు ఎన్నికయ్యారు.

కేజీహెచ్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ సంఘం అధ్యక్షుడిగా సూరిబాబు
సమావేశానికి హాజరైన సభ్యులు

మహారాణిపేట, డిసెంబరు 4: కేజీహెచ్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అండ్‌ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ అర్బన్‌ కమిటీ అధ్యక్షుడిగా డి.సూరిబాబు ఎన్నికయ్యారు. రాష్ట్ర కోర్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎ.అప్పారావు ఆధ్వర్యంలో రేడియాలజీ విభాగం గ్యాలరీలో శుక్రవారం అర్బన్‌ ఏరియా సభ్యులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా యూసఫ్‌అలీ, అసోసియేషన్‌ అధ్యక్షునిగా సిహెచ్‌.జోగిరాజు, ఉపాధ్యక్షునిగా హెచ్‌.వి.రమణమూర్తి ఎన్నికకాగా గౌరవ సలహాదారులుగా కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలి, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సూర్యనారాయణ నియమితులయ్యారు. 

 

Updated Date - 2020-12-05T05:39:24+05:30 IST