నాడు వితరణ నేడు ఆక్రమణ

ABN , First Publish Date - 2021-01-19T05:24:23+05:30 IST

గ్రామాభివృద్ధి కోసం నాడు స్థానికులు కలిసి తలా ఇంత నగదును వసూలు చేసి భూమిని కొన్నారు. ప్రభుత్వ సూచన మేరకు రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వితరణగా ఇచ్చారు. అయితే మూడు దశాబ్దాలు గడిచిన తర్వాత నాడు అమ్మిన వారు.. నేడు కబ్జాకు తెర లేపారు. ఈ తతంగం లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పీహెచ్‌సీ పరిధిలో జరిగింది.

నాడు వితరణ నేడు ఆక్రమణ
రేగళ్లలో తమదేనంటూ భూమి చుట్టు కర్రలు పాతిన అక్రమార్కులు

హన్మంతుడి విగ్రహాన్నీ తొలగించిన తీరు

అదనపు కలెక్టర్‌ అనుదీ్‌పకు స్థానికుల ఫిర్యాదు

లక్ష్మీదేవిపల్లి, జనవరి 18: గ్రామాభివృద్ధి కోసం నాడు స్థానికులు కలిసి తలా ఇంత నగదును వసూలు చేసి భూమిని కొన్నారు. ప్రభుత్వ సూచన మేరకు రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వితరణగా ఇచ్చారు. అయితే మూడు దశాబ్దాలు గడిచిన తర్వాత నాడు అమ్మిన వారు.. నేడు కబ్జాకు తెర లేపారు. ఈ తతంగం లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పీహెచ్‌సీ పరిధిలో జరిగింది. ఈ కబ్జా విషయాన్ని స్థానికులు తెలుసుకొని అక్రమార్కులను అడ్డుకున్నారు. దీంతో స్థానికులకు, కబ్జాదారులకు వాగ్వాదం జరిగింది. అంతేగాకుండా ఈ ప్రాంతంలో గతంలో ఏర్పాటుచేసిన హన్మంతుడి విగ్రహాన్ని సైతం తొలగించి పక్కన పడేయటం పట్ల మరింత స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. కొన్నేళ్ల క్రితం అమ్ముకొని ఇప్పుడు తమదేనంటూ రావడం ఎంత వరకు సబబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సోమవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌ను పరిశీలించేందుకు వచ్చిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ దురిశెట్టి అనుదీ్‌పకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన అనుదీప్‌ గతంలో మంచి కార్యక్రమానికి భూమి ఇచ్చి తిరిగి తీసుకోవడంపై విక్రయదారులను మందలించారు. మంచి పని కోసం ముందుకు రావాలని, ఇటువంటి పరిణామాలతో గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ భద్రకాళిని ఆదేశించారు. 


Updated Date - 2021-01-19T05:24:23+05:30 IST