బరంపురం టు కాకినాడ

ABN , First Publish Date - 2021-06-20T05:54:09+05:30 IST

ఒడిశాలోని బరంపురం నుంచి కంటైనర్‌లో కాకినాడకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ఖైనీ, గంజాయి నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. బెల్లుపడ పాత టోల్‌ప్లాజా వద్ద శనివారం మెరుపుదాడి చేసి సుమారు రూ.21లక్షల సరుకును స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌ను సీజ్‌ చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఇచ్ఛాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఈ వివరాలను డీఎస్పీ శివరామిరెడ్డి వెల్లడించారు.

బరంపురం టు కాకినాడ
పోలీసులకు పట్టుబడిన ఖైనీ ప్యాకెట్లు, గంజాయి నిల్వలు

 కంటైనర్‌లో భారీగా ఖైనీ, గంజాయి రవాణా

 బెల్లుపడ వద్ద పట్టుకున్న పోలీసులు

 ఇద్దరు అరెస్టు..  రూ.21లక్షల సరుకు స్వాధీనం

ఇచ్ఛాపురం, జూన్‌ 19: ఒడిశాలోని బరంపురం నుంచి కంటైనర్‌లో కాకినాడకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ఖైనీ, గంజాయి నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. బెల్లుపడ పాత టోల్‌ప్లాజా వద్ద శనివారం మెరుపుదాడి చేసి సుమారు రూ.21లక్షల సరుకును స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌ను సీజ్‌ చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఇచ్ఛాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఈ వివరాలను డీఎస్పీ శివరామిరెడ్డి వెల్లడించారు. కాకినాడకు చెందిన పచ్చిగోళ్ల అప్పారావు అనే వ్యాపారి బరంపురంలో ఖైనీ, గంజాయిని కొనుగోలు చేసి కంటైనర్‌లో రాష్ట్రానికి తీసుకొస్తున్నట్లు సీఐ వినోద్‌బాబుకు సమాచారం అందింది. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. బెల్లుపడ పాత టోల్‌ప్లాజా వద్ద బరంపురం నుంచి వస్తున్న ఏపీ05-టీఎక్స్‌ 3257 నెంబరు గల కంటైనర్‌ను ఆపి తనిఖీ చేయగా అందులో ఖైనీ ప్యాకెట్లు, గంజాయి ఉన్నట్లు గుర్తించారు. రూ20.35లక్షల విలువ చేసే 87 ఖైనీ ప్యాకెట్ల బస్తాలు, రూ.90వేలు విలువ చేసే రెండు గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేసి వ్యాపారి అప్పారావుతో పాటు డ్రైవర్‌ త్రిమూర్తులను అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు గుట్కా, ఖైనీ, గంజాయి, మద్యం అక్రమ రవాణా నియంత్రణకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచామన్నారు. కార్యక్రమంలో సీఐ వినోద్‌బాబు, పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ, రైటర్‌ రామారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T05:54:09+05:30 IST