జమ చేయకుండా మమ

ABN , First Publish Date - 2022-01-17T06:12:07+05:30 IST

నగరపాలక సంస్థలోని ఒక డివిజన్‌లో బిల్‌కలెక్టర్‌ రూ. 96 వేలు వసూలు చేసి కార్యాలయంలో జమ చేయలేదు.

జమ చేయకుండా మమ

వసూలు  చేసిన రూ.96వేలు స్వాహా?

ఊసులేని ఇసాల్‌నామా

సకాలంలో సొమ్ములు జమచేయని బిల్‌కలెక్టర్లు

ఇదీ ఖమ్మం నగరపాలకంలో పరిస్థిథి

ఖమ్మం కార్పోరేషన్‌, జనవరి 16: నగరపాలక సంస్థలోని ఒక డివిజన్‌లో బిల్‌కలెక్టర్‌ రూ. 96 వేలు వసూలు చేసి కార్యాలయంలో జమ చేయలేదు. సదరు బిల్‌కలెక్టర్‌ విధులకు గైర్హాజరవుతున్నాడు. కాగా అదే డివిజన్‌ను వేరే బిల్‌ కలెక్టర్‌కు కేటాయించగా విషయం వెలుగులోకి వచ్చింది. బిల్‌కలెక్టర్లకు ఇచ్చిన హ్యాండ్‌మిషన్‌లలో బిల్‌కలెక్టర్‌ వాడుకున్న సొమ్ములు బకాయి చూపెడుతున్నాయి. దీంతో సదరు డివిజన్‌లో ఆస్తిపన్నులు వసూలు చేయనని చెప్పటంతో ఈ విష యం నగరపాలక సంస్థ కమిషనర్‌ దృష్టికి తీసుకురాకుండా రెవెన్యూ అధికారులు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. కాగా హ్యాండ్‌మిషన్‌ పనిచేయటం లేదంటూ ఆ డివిజన్‌ ప్రజలు ఆస్తిపన్నులు కార్యాలయానికే వచ్చి జమచేయాలని చెబుతున్నారు.

పర్యవేక్షణ నిల్‌... ఊసులేని ఇసాల్‌నామా

నగరపాలక సంస్థలో వసూలు చేసిన ఆస్తిపన్నులు జమపై పర్యవేక్షణ కొరవడింది, ఎవరు ఎంత వసూలు చేస్తున్నారు, ఎంత జమ చేస్తున్నారు? అన్న విషయాన్ని పట్టించుకోవటం లేదు. వాస్తవంగా ఆస్తిపన్నుల జమ గురించి, ఒక రిజిస్టర్‌ను నిర్వహించాలి. దాన్ని ఇసాల్‌నామా అంటారు. బిల్‌కలెక్టర్లు తాము వసూలు చేసిన పన్నుల వివరాలు సదరు రిజిస్టర్‌లో నమోదు చేయాలి. దానిని ధృవీకరిస్తూ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌, రెవెన్యూ అధికారి సంతకాలు చేయాలి. అనంతరం పన్నులకు సంబంధించిన సొమ్ములను జమచేయాలి. ఇదంతా జరగకుండానే బిల్‌కలెక్టర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తుంటే. రెవెన్యూ అధి కారులు పట్టించుకోవటం లేదు. పలితంగా నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయం దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సకాలంలో సొమ్ములు జమచేయక..

నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న బిల్‌కలెక్టర్లు వసూలు చేసిన ఆస్తిపన్నులను సకాలంలో జమచేయటం లేదన్న ఆరోఫణలు ఉన్నాయి. తాజాగా జరిగిన సంఘటన దీనకి బలం చేకూరుతున్నది. ఇటీవల నల్గొండ మున్సిపాలిటీలో ఇలానే సొమ్ములు దుర్వినియోగం అయి పలువురు సస్పెండ్‌ అయ్యారు. ఆస్తిపన్నులు వసూలు చేసిన వెంటనే కార్యాల యంలో జమచేయాలి. అలా కాకుండా కొన్ని రోజులు తమ వద్ద ఉంచుకొని, సొంత అవసరాలకు వాడుకుంటున్నట్లు సమా చారం. కమిషనర్‌ ఆదర్శ్‌సురభి ఈ విషయాలపై విచారణ చేస్తే రెవెన్యూ విభాగంలో జరిగే అవకతవకలు బయటపడే అవకాశం ఉంది.

Updated Date - 2022-01-17T06:12:07+05:30 IST