చైనా సరిహద్దుల్లో పరిస్థితిపై అరుణాచల్ ప్రదేశ్ సీఎం స్పందన ఇదీ..

ABN , First Publish Date - 2020-06-02T00:43:14+05:30 IST

అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్, చైనా బలగాల మధ్య ప్రస్తుతం ఎలాంటి ప్రతిష్టంభన లేదని సీఎం పెమా...

చైనా సరిహద్దుల్లో పరిస్థితిపై అరుణాచల్ ప్రదేశ్ సీఎం స్పందన ఇదీ..

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్, చైనా బలగాల మధ్య ప్రస్తుతం ఎలాంటి ప్రతిష్టంభన లేదని సీఎం పెమా ఖండూ స్పష్టం చేశారు. చైనాతో అరుణాచల్ ప్రదేశ్‌ 1080 కిలోమీటర్ల మేర సరిహద్దు పంచుకుంటోంది. ఇటీవల లడఖ్ సహా మరి కొన్ని ప్రాంతాల్లో భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నట్టు పలు వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సీఎం ఖండూ స్పందించారు. లడఖ్‌ జరిగిన సంఘటన ‘‘దురదృష్టకరమనీ’’... ప్రత్యేకించి కరోనా కల్లోలం మధ్య ఇలాంటి పరిణామాలు మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరు దేశాల మధ్య ‘‘యుద్ధ వాతావరణం’’ మాత్రం లేదని, అంతా సాధారణంగానే ఉందని సీఎం స్పష్టం చేశారు. ‘‘ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి పరిస్థితినైనా చక్కబెట్టగల నేర్పు ప్రధాని నరేంద్ర మోదీకి ఉంది. ఈ అంశంపై ఇప్పటికే రక్షణ శాఖ తన వైఖరిని స్పష్టం చేసింది..’’ అని ఖండూ పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-02T00:43:14+05:30 IST